లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌లా సీతారామ‌న్‌

Nirmala Sitharaman introduced budget in the Lok Sabha

కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ పూర్తి స్థాయి మ‌హిళా మంత్రిగా నిర్మ‌ల రికార్డు సృష్టించారు. భార‌త దేశం త‌న ప్ర‌జాస్వామ్యాన్ని సెల‌బ్రేట్ చేసుకుంద‌న్నారు. ఓట‌ర్లు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌లు న‌వ భార‌తాన్ని ప్ర‌తిబింబించాయ‌న్నారు. ఓట‌ర్లు భారీ స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నార‌న్నారు. మోదీ స‌ర్కార్‌కు త‌మ మ‌ద్ద‌తును తెలిపార‌న్నారు.