సింగిల్ టేక్‌లో ఓకే అయిన‌ కాలేజీ క్యాంటీన్ సాంగ్‌

college canteen song in single take

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రానికి ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు భ‌ర‌త్ క‌మ్మకు ఇదే తొలిచిత్రం. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సంబంధించి ‘కడలల్లే వేచె కనులే’, ‘గిర గిర గిర’మెలోడీ పాటలు యూత్‌ను ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు ఇటీవ‌ల‌ కాలేజ్ సాంగ్ విడుద‌ల చేశారు. ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెను..’ అంటూ సాగే ఈ పాట యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కార్తిక్ రోడ్రిగెజ్ ఈ పాట‌ని ఆల‌పించ‌గా, రెహ‌మాన్ లిరిక్స్ అందించారు. అయితే ఈ సాంగ్‌ని సింగిల్ టేక్‌లో ఓకే చేసిన‌ట్టు మేకింగ్ వీడియో ద్వారా తెలిపింది చిత్ర బృందం. మలయాళం, తమిళం, తెలుగు, క‌న్న‌డ‌ భాషల్లో చిత్రం విడుద‌ల కానుంది.