మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు పలు సాలిడ్ సినిమా లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో తన “ఫ్యామిలీ స్టార్” సినిమా మంచి వైరల్ గా మారుతుండగా రీసెంట్ గా కీడా కోలా ప్రీ రిలీజ్ కి వచ్చి కూడా విజయ్ మంచి సందడిని చేసాడు. అయితే మూవీ పరంగా విజయ్ ని పక్కన పెడితే తాను పర్శనల్ గా చాలా మందికి సాయం చేయడం స్టార్ట్ చేసాడు.

అప్పుడు కరోనా సమయం నుంచి ఇప్పుడు వరకు కూడా అనేక సందర్భాల్లో చాలా మందికి అండగా నిలిచిన విజయ్ తన గత సినిమా ఖుషి సమయంలో కూడా ఏకంగా ఒక కోటి రూపాయలు 100 కుటుంబాలకి ఒకో లక్ష చొప్పున పంచి తన పెద్ద మనసు ని చాటుకున్నాడు. అయితే తాజాగా మరో ఆసక్తికర ఇన్సిడెంట్ ఒకటి బయటకి వచ్చింది.

మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్న విజయ్ దేవరకొండ - Telugu Bullet

శ్రీకాకుళం కి చెందిన కోటబొమ్మాళి ప్రాంతంలో ఒక చిన్నారి రోడ్డు ప్రమాదంలో తన కాలుని పోగొట్టుకున్న విషయం విజయ్ దృష్టికి రాగా తాను వివరాలు కనుక్కొని ఒక లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఆ చిన్నారి కుటుంబానికి ఇచ్చాడు . దీనితో ఈ విషయం ఇప్పుడు ఫ్యాన్స్ లో బాగా వైరల్ అయ్యింది . దీనితో ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ తమ హీరో పట్ల మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.