ఇంట్రెస్టింగ్ రన్ టైం తో రాబోతున్న “కీడా కోలా” సినిమా …

ఇంట్రెస్టింగ్ రన్ టైం తో రాబోతున్న “కీడా కోలా” సినిమా ...
Cinema News

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మంచి ఇంట్రెస్టింగ్ అండ్ అవైటెడ్ సినిమా ల్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా “కీడా కోలా” కూడా ఒకటి. మరి ఈ సినిమా కి పైడ్ ప్రీమియర్ స్టార్ట్ చేస్తే దానికి అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఈ సినిమా పట్ల ఆడియెన్స్ ఎంత ఆసక్తి గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కి అయితే మేకర్స్ ఒక పర్ఫెక్ట్ రన్ టైం ని లాక్ చేసుకున్నట్లు గా తెలుస్తోంది.

ఇంట్రెస్టింగ్ రన్ టైం తో రాబోతున్న “కీడా కోలా” సినిమా ...
Keeda Cola

దీనితో అయితే ఈ సినిమా కేవలం 2 గంటల రన్ టైం మాత్రమే ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ తరహా చిత్రాలకి ఇదొక పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. ఎక్కడా ల్యాగ్ లాంటివి అనిపించకుండా ఉండాలి అంటే ఈ మాత్రం చాలని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో చైతన్య రావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తదితరులు నటించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు అలాగే ఈ నవంబర్ 3న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.