అర్జున్ రెడ్డి అనే నేను !

Vijay Devarakonda plays Chief Minister role in Nota Movie

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన విజయ్ దేవరకొండ మళ్ళీ అదే రేంజ్ లో తన ప్రతాపాన్ని చూపాలని అనుకుంటున్నాడు… ప్రస్తుతం విజయ్ నటించిన ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ చిత్రాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తెలుగు… తమిళ భాషల్లో ‘నోటా’ అనే సినిమా చేస్తున్నాడు. వరుసగా రెండు సినిమాలతో ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా ఒక పాత్రకు మరో పాత్ర పొంతన లేకుండా చూసుకొంటున్నాడు.

త్వరలో విడుదల కాబోతున్న నోటా చిత్రంలోని విజయ్ దేవరకొండ పాత్ర దక్షిణాదిలో చర్చనీయాంశమవుతున్నది. విజయ్ పోషించేది ముఖ్యమంత్రి పాత్ర కావడం విశేషం. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మెహరీన్ కథానాయికగా నటిస్తుంది. ఈ మధ్య మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ విజయాన్ని సాధించింది. అలాగే ‘నోటా’ కూడా విజయ్ దేవరకొండకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.