విజయ్ వెంట పడుతున్న ఆ ముగ్గురు

three directions waiting for vijay devarakonda

విజయ్ దేవరకొండ ఆర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీ వాలా చిత్రాల విజయం తో ఓవర్ నైట్ స్టార్ హీరో గా మారిపోయాడు. ఇప్పుడు విజయ్ డేట్స్ కోసం టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లైన్ కడుతున్నారు. తాజాగా ముగ్గురు స్టార్ డైరక్టర్స్ విజయ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అందులో పూరి జగన్నాధ్, మారుతీ, గోపీచంద్ మలినేని లు ఉన్నారు. ఈ ముగ్గురు విజయ్ కి కథను వినిపించి ఒకే చేసుకోవాలి చూస్తున్నారు. శైలజ రెడ్డి అల్లుడు తరువాత మంచి సినిమాను రూపొందించాలి అని మారుతీ ప్రస్తుతానికి ఓ రెండు కథలను సిద్దం చేశాడు. ఈ రెండింట్లో ఏదైనా ఒక్కటి ఒపించాలి అని చూస్తున్నాడు. అలాగే పరస పరాజయాలతో సతమత మావ్వుతున్నా ఒకప్పటి స్టార్ డైరక్టర్ పూరి కూడా విజయ్ కి ఓ కథను చెప్పాడంట.

gopichandh malineni director

గోపీచంద్ మలినేని కూడా ఓ కథను విజయ్ దేవరకొండ కోసం సిద్దం చేస్తున్నాడు. త్వరలోనే విజయ్ కి కథ చెప్పి లాక్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతానికి విజయ్ మాత్రం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తూఉన్నాడు. ఈ చిత్రం తరువాత మరో రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఈ రెండు చిత్రాలే కాకుండా మరో నలుగు చిత్రాలకు సంబందించిన అడ్వాన్సులు కూడా అయన కాడా ఉన్నాయి. విజయ్ మాత్రం ఓ సినిమా తరువాత మరో సినిమా అన్నట్లు గా సెట్స్ పైకి తిసుకేల్లుతున్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నాడు. మరి పై ముగ్గురి డైరక్టర్స్ లో ఎవరికీ పచ్చ జెండా ఉపుతాడో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు అగాలిసిందే.