2.ఓ కలెక్షన్స్ లో అనూహ్య మార్పు

robo-2.0

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 2.ఓ ఈ చిత్రం భారీ గ్రాఫిక్స్ మరియు 3D ఎఫెక్ట్స్ తో తెలుగు, తమిళ, హింది బాషలో ఘనంగా విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా వసూళ్ళ పరంగా తొలి నాలుగు రోజులు వెనకబడింది.అయిదవ రోజు నుండి ఈ సినిమా అంచనాలను తారుమారు చేస్తూ కలెక్షన్స్ పరంగా దూసుకేల్లుతుంది. తెలుగు తమిళంలో మొదటి వారం కలెక్షన్స్ ని చుసినట్లుయితే 500కోట్లును రాబట్టింది. అనువాద చిత్రంగా విడుదలైన తెలుగు రాష్ట్రాలలోని నైజాం ఏరియాలో ఏకంగా మొదటి వారం 17 కోట్ల షేర్ ను సంపాదించింది.

Robo 2.0 Movie Collectionsనైజాం ఏరియాలో ఓ అనువాద చిత్రం ఇంత మొత్తంలో వసూళ్ళు చెయ్యడం ఇదే మొదటిసారి. ఇంకో నాలుగు రోజులు సెలవ దినాలు ఉండటం తో ఈ చిత్రం అంచనాలను తారుమారు చెయ్యవచ్చు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో నిన్న ఒక్క రోజు 10 కోట్లు రాబట్టగలిగింది. 2.ఓ చిత్రం తరువాత శంకర్, లోకనాయకుడు కమలహాసన్ తో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ తీసేపనిలో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాన్ని 200 కోట్లు బడ్జెట్ తో లైక ప్రొడక్షన్స్ తెరకేక్కిస్తుంది. రజినీకాంత్ పెట్టా మూవీని తీసుకు వచ్చే పనిలో పడ్డాడు.