చివరి నిముషంలో బాబుకి పెద్ద దెబ్బ కొట్టిన ఉత్తమ్ !

మ‌రోమారు తెలంగాణ‌లోని పార్టీలు క‌ట్టిన దోస్తీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అర్థరాత్రి షాక్ త‌గిలింది. త‌న మార్క్ రాజ‌కీయం ఎలా ఉంటుందో కాంగ్రెస్ రుచి చూపించింది. పోలింగ్‌కు కొన్ని గంట‌ల ముందు టీడీపీ అభ్య‌ర్థిని నిలిపిన చోట త‌మ పార్టీ రెబ‌ల్ అభ్య‌ర్థి కోస‌మే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప‌నిచేయాల‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ క‌లిసి కూట‌మి క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సీట్ల పంప‌కం నుంచి మొద‌లుకొని నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌న్న పాత్ర పోషించింది. ఈ ద‌శ‌లోనే ఆయా పార్టీల్లో ఎన్నో లుక‌లుక‌లు, అసంతృప్తులు, ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కొంద‌రు పార్టీని వీడారు, ఇంకొంద‌రు దుమ్మెత్తిపోశారు. ఇదంతా స‌ద్దుమ‌ణిగి పోలింగ్ స‌మీపిస్తున్న ద‌శ‌లో టీపీసీసీ త‌ర‌ఫున కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించిన ఇబ్ర‌హీంప‌ట్నంలో బ‌రిలో ఉన్న టీడీపీ అభ్య‌ర్థికి కాకుండా కాంగ్రెస్ రెబ‌ల్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

చివరి నిముషంలో బాబుకి పెద్ద దెబ్బ కొట్టిన ఉత్తమ్ ! - Telugu Bullet

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారిక పీఆర్ఓ ఈ మేర‌కు మీడియాకు స‌మాచారం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ కూటమి మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మల్‌ రెడ్డి రంగారెడ్డి కె మద్దతు ఇచ్చి పనిచేయాలి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా, ఈ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న సామ‌రంగారెడ్డి షాక్‌కు లోన‌వ‌గా, బీఎస్పీ నుంచి బ‌రిలో ఉన్న కాంగ్రెస్ రెబ‌ల్ మ‌ల్రెడ్డి రంగారెడ్డి ఖుష్ అవుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం తరపున సామ రంగారెడ్డి బరిలో దిగారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. కానీ పొత్తుల్లో ఈ సీటు కాంగ్రెస్ కు కేటాయించడం కుదరలేదు. దీంతో ఆగ్రహించిన మల్ రెడ్డి రంగారెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. బీఎస్పీ నుంచి టికెట్ సంపాదించుకుని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. పేరుకు బీఎస్పీ అయినా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే ప్రచారం చేసుకున్నారు.

uttam kumar cheating about chandrababu

మూడు రంగుల జెండాలో ఏనుగు గుర్తు ఉన్న జెండాలతో ప్రచారం హోరెత్తించారు. ఇక్కడ ప్రజాకూటమి తరపున బరిలో ఉన్న సామ రంగారెడ్డి వాస్తవానికి ఎల్బీనగర్ సీటు ఆశించారు. ఆయనకు ఇబ్రహీంపట్నంలో ఏమాత్రం పట్టులేదు. కానీ అనేక సమీకరణాల కారణంగా సామ రంగారె‌డ్డి ఇబ్రహీం పట్నం కేటాయించాల్సి వచ్చింది. ఆయనా అయిష్టంగానే బరిలో దిగారు. మల్ రెడ్డి రంగారెడ్డి బలమైన అభ్యర్థి కావడంతో ఇక్కడ ఆయన గెలవబోతున్నారని సర్వే కింగ్ లగడపాటి రాజగోపాల్ కూడా జోస్యం చెప్పారు. అనేక చోట్ల తిరుగుబాటు అభ్యర్థులను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ మల్ రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఆయన గెలుపు ఖాయం అని తేలడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్ రెడ్డికే ఓటేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమి ఒప్పందానికి విరుద్ధంగా మల్‌రెడ్డి రంగారెడ్డికే పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ దిగిరాక తప్పలేదు. ఆయనకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటర్లలో నెలకొన్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారని చెబుతోంది.