‘ఎన్టీఆర్‌’లో పురందేశ్వరి ఈమెనే!

Purandeswari Role Confirmed for NTR Biopic

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో పలువురు ముఖ్య నటీనటులు నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా చంద్రబాబు నాయుడు పాత్రను రానా, ఏయన్నార్‌ పాత్రను సుమంత్‌, బసవతారకం పాత్రను విద్యాబాలన్‌, హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌, శ్రీదేవి పాత్రను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోషిస్తున్నారు. ఇక ఇంకా ఈ చిత్రంలో పలువురు ముఖ్య వ్యక్తుల పాత్రలకు సంబంధించిన నటీనటుల వివరాలు వెళ్లడి కావాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కూతురు పురందేశ్వరి పాత్రను డాన్సర్‌ హిమన్సీ పోషిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Himansee Katragadda

ఎన్టీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన కూతురుగా పురందేశ్వరికి గుర్తింపు ఉంది. తండ్రి వారసత్వంను పునికి పుచ్చుకుని ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పురందేశ్వరి పాత్రకు మంచి పవర్‌ ఫుల్‌ ఫేస్‌ ఉన్న మహిళ అయితే బాగుంటుందని క్రిష్‌ భావించాడు. దానికి తోడు పురందేశ్వరి ఒక డాన్సర్‌ కనుక, ఆమె పాత్రకు నిజంగా డాన్సర్‌ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించి, హిన్సీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నో స్టేజ్‌ షోలు ఇచ్చిన హిమాన్సి తో పురందేశ్వరి ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య ఈ చిత్రంను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.