మరో పరువు హత్య…కానీ ఈ సారి సీన్ రివర్స్

murder

నా భారత దేశంలో ఏమి నడుస్తోంది. అంటే పరువు నడుస్తోంది పరువు కోసం హత్యలు నడుస్తున్నాయి అని చెప్పాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. పరువు, ప్రతిష్ట పేరుతో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. సాధారణంగా మన దేశంలో ఆధిపత్య కులాలదే పైచేయి కనుక ఈ కేసుల్లో హతులు దళిత, బీసీ యువకులే ఉంటరని అందరి భావన. కానీ దీనికి భిన్నమైన కులహత్య జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. కులాంతర వివాహం చేసుకున్న ఓ బ్రాహ్మణ యువకుడిని అతని నలుగురు బావమరుదులు పక్కా పథకం ప్రకారం చంపేసారు. పోలీసుల వివరాల ప్రకారం ముజఫర్‌నగర్ జిల్లా కుత్బా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మనోజ్‌ శర్మ(29), సోనియా(26) అనే యువతీయువకులకు ఉద్యోగపరీక్షల శిక్షణలో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. అయినా ఎదిరించి మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు.

marriage

తర్వాత శర్మకు ముంబైలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)లో డేటా ఎంట్రీ ఉద్యోగం వచ్చింది. సోనియాకు కూడా సర్కారు కొలువు వచ్చింది. కానీ శర్మ ఇటీవలే ఢిల్లీకి బదిలీ అయ్యాడు. డ్యూటీలో చేరాల్సి ఉంది ఈ నేపధ్యంలో సోనియా కుటుంబ సభ్యులు ఆ జంటకు ఫోన్ చేసి ఊరికి రావాలని కోరారు. శర్మ ఈ నెల 18న కుత్బాలోని అత్తారింటికి వచ్చాడు. మరుసటి రోజు భాగపట్ జిల్లా గాంగనైలి గ్రామంలోని తన ఇంటికి బయల్దేరాడు. అతని వెంట బావమరుదులు కూడా ఉన్నారు. అయితే శర్మ మరుసటి రోజు ఇంటికి చేరుకోకపోవడతో సోనియాకు తన తోటుబుట్టులపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బావమరుదులను తమదైన శైలిలో విచారించడతో నిజం బయటపడింది. శర్మను చంపిన తర్వాత మృతదేహాన్ని వారి చెరుకుతోటలో పూడ్చిపెట్టారు. మనోజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సదరు గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన వలన స్పష్టమయ్యేది ఒక్కటే ఇపుడు జరుగుతున్నవి కుల హత్యలు కాదు పరువు హత్య.