ఈసారి కళ్యాణ్‌ రామ్‌ కోసం

Kona Venkat Refers to Story For Kalyan Ram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రముఖ రచయిత కోన వెంకట్‌ మంచి కథలు రాయడంతో పాటు, ఆ కథ ఎవరికి ఎంత మేరకు సెట్‌ అవుతుంది అనే విషయంలో జడ్జ్‌ చేయడంలో సిద్ద హస్తుడు. ఈయన గత సంవత్సరం నాని వద్దకు ‘నిన్ను కోరి’ చిత్ర కథను పంపించాడు. ఆ చిత్ర నిర్మాణంలో స్వయంగా పాలు పంచుకున్నాడు. నానికి ఆ చిత్రం సూపర్‌ హిట్‌ను ఇచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘నిన్ను కోరి’ చిత్రంతో దర్శకుడు శివ నిర్వాన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో కథను నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ వద్దకు పంపించాడు. పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన వ్యక్తి రెడీ చేసిన కథను విన్న కోన వెంకట్‌ ఆ కథకు కళ్యాణ్‌ రామ్‌ అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాడని, ఆయన వద్దకు వెళ్లాల్సిందిగా సూచించాడు.

కోన వెంకట్‌ సూచన మేరకు ఆ యువ దర్శకుడు చెప్పిన కథ విన్న కళ్యాణ్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ‘నిన్ను కోరి’ చిత్రం తరహాలోనే కోన వెంకట్‌ ఈ చిత్రంకు రెండవ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ ‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే’ చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రాలు విడుదల కాకుండానే ఈ చిత్రానికి కళ్యాణ్‌ రామ్‌ కమిట్‌ అయ్యాడు. దీనికంటే ముందు పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సి ఉండగా, ఆ చిత్రాన్ని పక్కన పెట్టి ఈ చిత్రాన్ని చేయాలని కళ్యాణ్‌ రామ్‌ ఫిక్స్‌ అయ్యాడు. అతి త్వరలోనే కోన వెంకట్‌ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన స్వయంగా వెళ్లడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. ‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే’ చిత్రాలతో పాటు ఈ చిత్రం కూడా ఇదే సంవత్సరంలో విడుదల చేయబోతున్నారు.