‘మా’కు మూట ముట్టజెప్పిందట

Sri Reddy Paid Money As Cheque To Get MAA Association Membership

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్న శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆ మద్య స్టార్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌తో తనకున్న సంబంధం గురించి బయట పెట్టి సంచలనాలకు తెర లేపిన శ్రీరెడ్డిపై మొదట మా వారు బ్యాన్‌ విధించిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి చాలా నెలల క్రితం మా లో సభ్యత్వం కోసం ధరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే మా వారు మాత్రం ఆమెకు సభ్యత్వం ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఆమె ఉద్యమం ఉదృతం చేయడంతో ఆమెపై ఉన్న నిషేదాన్ని ఎత్తి వేస్తున్నట్లుగా చెప్పడంతో పాటు, ఆమెకు సభ్యత్వం ఇచ్చేందుకు పరిశీలిస్తామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. మా వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సినిమా ఇండస్ట్రీ పరువు పోయిందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ఈ సమయంలోనే మళ్లీ శ్రీరెడ్డి మా సభ్యత్వం కోసం మరోసారి ధరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈమె గతంలో దరఖాస్తు చేసుకున్న సమయంలో డబ్బు చెల్లించలేదని, అందుకే ఆమె దరఖాస్తును తిరష్కరించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈసారి అలా కాకుండా మా వారు అడిగిన డబ్బును చెక్‌ రూపంలో ఇచ్చాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. మా వారు అడిగిన డబ్బుల మూటను వారికి ముట్టజెప్పాను అని, అయితే మా పెద్దలు విదేశాల్లో ఉన్న కారణంగా సభ్యత్వంపై చివరి నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం పడుతుందని అక్కడున్న వారు చెప్పుకొచ్చారట. మరో అయిదు రోజుల్లో తన సభ్యత్వ విషయమై క్లారిటీ వస్తుందని శ్రీరెడ్డి ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు సభ్యత్వం వస్తే మా సభ్యురాలిగా కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతాను అని, లేదంటే మరో విధంగా పోరాడుతాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.