పరిటాల రవి రియల్ హీరో, చెప్పండి మీ నక్కకి !

పవన్ కళ్యాణ్ ని నక్క తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ లో వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీ రెడ్డి. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడి రియల్ హీరో అంటే పరిటాల రవి అంతేకాని పవన్ కళ్యాణ్ కాదు అంటూ మరింతగా పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతోంది. అంతేనా పరిటాల రవి ఇప్పుడుంటే కథ మరోలా ఉండేదని పరోక్షంగా ఎప్పుడో పరిటాల రవి కి పవన్ కళ్యాణ్ కు జరిగిన సంఘటన ని చెప్పకనే చెబుతోంది శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించాడని అప్పట్లో సంచలనాత్మక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

అయితే అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి పరిటాల సునీత కూడా ఖండించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలు పవన్ పేరే ప్రస్తావించకుండా పవన్ మీద విరుచుకు పడింది శ్రీ రెడ్డి. జుట్టుకి రంగేసుకొని , గడ్డానికి పెయింటింగ్ వేసుకొని అరుస్తూ ప్రసంగిస్తే చేగువేరా అవుతారా ? నిద్రలేవండీ గొర్రెల్లారా !అసలే ఇది వర్షాకాలంరా నాయనా వానలోకి వెళ్లోద్దని చెప్పండి లేదంటే రంగు వెలిసి పోతుంది పులి వేషం వేసుకున్న మీ నక్కకి అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. అయితే ఈ పోస్ట్ మీద పవన్ ఫాన్స్ సీరియస్ అవుతున్నారు.