లారెన్స్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు

Sri Reddy allegations on Lawrence and Srikanth

గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా హీరోలు మరియు పలువురు సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది తనను వాడుకున్నారు అని, తనకు అవకాశాలు ఇప్పిస్తాను అంటూ ఏ ఒక్కరు కూడా అవకాశాలు ఇప్పించలేదు అంటూ శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా టీవీల్లో, సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె టాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌కు వెళ్లింది. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులే కాకుండా తనను తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా వాడుకోవాలని చూశారు, కొందరు వాడుకున్నారు అంటూ శ్రీరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

శ్రీరెడ్డి ఇటీవలే తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో తమిళ మీడియా దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈమె తమిళ హీరో శ్రీకాంత్‌పై మరియు లారెన్స్‌పై ఆరోపణలు చేసింది. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ సమయంలో హైదరాబాద్‌ వచ్చిన శ్రీకాంత్‌ తనను వాడుకుని అవకాశం ఇస్తాను అంటూ మోసం చేశాడు అంది. శ్రీకాంత్‌ అవకాశం ఇప్పిస్తాను అంటూ మొహం చాటేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక లారెన్స్‌పై కూడా ఈమె సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్‌ గోల్కోండ హోటల్‌లో ఒకసారి లారెన్స్‌ను తాను కలిశాను అని, ఆ సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకి, నాతో అసభ్యంగా డాన్స్‌ చేయించాడు అంది. లారెన్స్‌కు ఉన్న పేరుతో ఆయన అవకాశాలు ఇప్పిస్తాడనే నమ్మకంతో చాలా కాలం ఆయనతో స్నేహంను కొనసాగించాను. కాని బెల్లంకొండ సురేష్‌ వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలను కుదుపు కుదిపేస్తున్నాయి. ఇంకా ఎన్ని పేర్లు ఈమె నోటి నుండి వస్తాయో అంటూ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.