లోక్ సభ సీన్ లోకి పవన్ కళ్యాన్ !

Pavan kalyan About No Confidence Motion

జనసేన అధినేతకు ఆలోచన తక్కువ ఆవేశం చాలా ఎక్కువ అని అర్ధం అవుతోంది. రాజకీయ వేదికల మీద అదోరకంగా జుట్టు ఎగదోసుకుంటూ, కన్నెర్ర చేసి, పిడికిలి బిగించి గాల్లోకి పిడిగుద్దులు గుద్దుతూ చాలెంజ్‌లు చేస్తారు. అలా ఒకసారి చేసిన ఓ చాలెంజ్ “మీరు అవిశ్వాసం పెట్టండి.. నేను దేశం మొత్తం తిరిగి మద్దతు సంపాదిస్తానని”. కానీ అది ఇప్పుడు కాదు గత పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. అన్నట్లుగానే ఆ సమావేశాల్లో అవిశ్వాస తీర్మాన నోటీసులు చాలా పార్టీలు ఇచ్చాయి. కానీ సభ ఆర్డర్‌లో లేని కారణంగా తిరస్కరణకు గురయ్యాయి. అప్పుడు మద్దతు సమీకరిస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ మొన్న స్పీకర్ అవిశ్వాసానికి తీసుకున్నప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.

అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చిన నేపధ్యంలో అందరూ పవన్ కల్యాణ్ ఏమి చేస్తాడా అని ఎదురు చూశారు. కానీ ఢిల్లీలో మూడు రోజుల నుంచి రాజకీయ హైడ్రామా నడుస్తున్నా, తెలుహుదేసం ఎంపీలు అన్ని పార్టీల నేతలను కలుస్తున్నా ఆయన నుండి ఎటువంటి స్పందనా లేదు, ఆయన ట్విట్టర్ పిట్ట సైతం ఎటువంటి కూతలూ కూయనూ లేదు. అసలు స్పందించకపోతే పార్టీకి డ్యామేజ్ వస్తుంది అనుకున్నారో ఏమో ? కాసేపట్లో అవిశ్వాస చర్చ వస్తుందనగా ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. ప్రత్యేకహోదా కోసం పోరాడటానికి పార్లమెంట్‌కు మించిన వేదిక ఉండదన్నారు.

బాగానే ఉంది చర్చ పూర్తయ్యింది, మరి కాసేపటికి పవన్ నుండి మరో ప్రకటన వచ్చింది, లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ చేసిన వాదన చాలా బలహీనంగా ఉందని, ప్రత్యేక హోదా కోసం వారు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదని తాను భావిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్పెషల్ ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా డిమాండ్ ను గతంలో వారు బలహీనపరిచారని చెప్పారు. వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాకు గత మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి, ఈ రోజు పార్లమెంటులో వ్యర్థమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన వచ్చే లాభమేమిటని ప్రశ్నించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలకు కేంద్ర ప్రభుత్వ వంచన తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మేము నమ్మాలా? అని ప్రశ్నించారు.

ఇక్కడ పవన్ ఎంత అనాలోచితంగా మాట్లాడుతున్నారో అర్ధం అవుతోంది. ప్రత్యేకహోదా కోసం పోరాడటానికి పార్లమెంట్‌కు మించిన వేదిక ఉండదని ఉదయం ట్వీట్ చేసిన ఆయనే 13 నిముషాలు టైం ఇస్తే 58 నిముషాలు ప్రసంగించిన విషయాన్నీ మరచి ఎక్కడి నుండో వచ్చిన ఆదేశాల ప్రకారం ట్వీట్ చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే పొద్దున్న ఒక మాట సాయంత్రానికి ఒక మాట మాట్లాడటం పవన్ కే చెల్లింది. తెలుగుదశం పార్టీ దేశంలోని ఇతర రాజకీయ పార్టీల కాళ్లా వేళ్లా పడి అవిశ్వాసానికి మద్దతుగా నిలబడేలా చేసింది.

మరి పవన్ కల్యాణ్‌ గతంలో తను చేసిన ప్రకటనకు న్యాయం చేసేలా కనీసం ఒకటి రెండు పార్టీలనైనా అవిశ్వాసానికి మద్దతుగా ఒప్పించడానికి ప్రయత్నాలు చేశారా..? తాను నివాసం ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను అవిశ్వాసానికి మద్దతిచ్చేలా ఒప్పిస్తానన్నారు. చెల్లెలు కవిత గారు అన్న నోరు వారిని మద్దతు అడిగేందుకు అయినా ప్రత్నించిందా ? కనీసం టీఆర్ఎస్ అధినేతతో అయినా.. మాట్లాడే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. అలాంటిది ఇప్పుడు తిరిగి టీడీపీ మీదే రివర్స్ అవడం విశ్లేషకులను సైతం అబ్బురపరుస్తోంది.