సుక్కుకు అభిమాని లేఖ

Sukumar gets letter from his Fan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లెక్కల మాస్టర్‌ అయిన సుకుమార్‌ సినిమాలపై అభిమానంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కెరీర్‌ ఆరంభం నుండి సినిమా సినిమాకు తన స్థాయిని అమాంతం పెంచుకుంటూనే వస్తున్నాడు. కొత్త తరహా సినిమాలను తెలుగు ప్రేక్షకులకు చూపించిన దర్శకుడు తాజాగా ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన ప్రతి సినిమాలో కూడా హీరోకు ఏదో చిన్న లోపం లేదా మరేదైనా వైవిధ్యభరిత పాయింట్‌ను చూపించిన సుకుమార్‌… తాజాగా రామ్‌ చరణ్‌ను చెవిటి వాడిగా ఈ చిత్రంలో చూపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే 90 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన రంగస్థలం చిత్రం విజయం క్రెడిట్‌ పూర్తిగా సుకుమార్‌ ఖాతాలో వేస్తున్నారు అభిమానులు.

‘రంగస్థలం’ సూపర్‌ హిట్‌ సందర్బంగా సుకుమార్‌కు ఒక అభిమాని లేఖ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేఖలో.. ‘లెక్కల మాస్టర్‌ అయిన మీరు మాకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో లెక్క గట్టి, సినిమాలో ఎలాంటి సీన్స్‌ ఉంటే సినిమా సక్సెస్‌ అవుతుందో లెక్క వేసి మరీ సినిమా తీస్తున్నారు. అందుకే మీరు తీసే ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యంగా నిలుస్తుంది. రంగస్థలం వంటి ఒక చిత్రం తీయాలి అంటే దమ్ము, ధైర్యం ఉండాలి. ఇలాంటి కథతో రామ్‌ చరణ్‌ను ఒప్పించడంతోనే మీరు సగం సక్సెస్‌ అయ్యారు. ఒక స్టార్‌ హీరో పూర్తి పల్లెటూరు పాత్రలో, అది కాకుండా చెవిటివాడి పాత్రలో నటించడంకు ఒప్పుకోరు. కాని మీరు రామ్‌ చరణ్‌ను ఒప్పించి ఆయనలోని నటుడిని వెలికి తీసి అద్బుతాన్ని ఆవిష్కరించారు. తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త రంగులు అద్దుతున్న మీరు మరెన్నో ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా…’ అంటూ అభిమాని పేర్కొన్నాడు. సుకుమార్‌ అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నేపథ్యంలో ఆయన క్రేజ్‌ మరింతగా పెరిగింది.