రావు రమేష్‌ చేస్తే ఇంకా బాగుండేదేమో?

Jagapathi Babu replaces Rao Ramesh Character in Rangasthalam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రంగస్థలం’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌, సమంతలు హీరో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కీలకమైన ప్రెసిడెంట్‌ పాత్రను జగపతిబాబు పోషించాడు. మొదట ఆ పాత్రను రావు రమేష్‌తో చేయించాలని భావించారు. కొన్ని సీన్స్‌ చిత్రీకరించిన తర్వాత ఏదో కారణం చెప్పి రావు రమేష్‌ను సినిమా నుండి తప్పించడం జరిగింది. ప్రెసిడెంట్‌ పాత్ర సినిమాకు అత్యంత కీలకం. ఆ కారణంగానే సినిమాలో రావు రమేష్‌ను తొలగించి జగపతిబాబును పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగున్న ప్రచారం ప్రకారం జగపతిబాబు కంటే ఆ పాత్రను రావు రమేష్‌ అయితే అద్బుతంగా పండిచ్చేవాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఇలాంటి పాత్రలను రావు రమేష్‌ అద్బుతమైన మేనరిజంతో మెప్పిస్తాడు. అయితే రావురమేష్‌ ఆ పాత్రను చేస్తే రామ్‌ చరణ్‌ను డామినేట్‌ చేసేవాడు అని, అందుకే జగపతిబాబును ఎంపిక చేసి ఉంటారు అంటున్నారు. రావు రమేష్‌ చేస్తే పాత్ర పరిధి మరింతగా పెరిగేది. గతంలో రావు రమేష్‌ చేసిన పాత్రలను పరిశీలిస్తే ప్రెసిడెంట్‌ పాత్రకు ప్రాణం పోసేవాడని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత క్రూరమైన పాత్రను జగపతిబాబు మెప్పించాడు, కాని రావు రమేష్‌ అయితే ఇంకా బెటర్‌గా నటించేవాడు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రావు రమేష్‌ను ఎందుకు తొలగించారో కాని సినిమాకు మరియు రావు రమేష్‌కు ఆ నిర్ణయం నష్టంను చేకూర్చిందని చెప్పుకోవచ్చు.