ఆ హీరోలు వ్యభిచారులు అయితే.. మీ టూ !

శ్రీరెడ్డి విమర్శలు, ఆమెపై ఇతరుల ప్రతి విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. తెలుగులో ఈమె ఎంతగా రెచ్చి పోయినా కూడా ఫ్యాన్స్‌ తప్ప సెలబ్రెటీలు ఏ ఒక్కరు పట్టించుకోలేదు. కాని తమిళనాట ఈమె ఇద్దరు ముగ్గురు స్టార్స్‌పై ఆరోపణలు చేసిందో లేదో అప్పుడే అరవ ఇండస్ట్రీ మొత్తం ఏకం అయ్యింది. శ్రీరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే విశాల్‌, కార్తీ, వారాహి, భారతి రాజా ఇంకా పలువురు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా వారాహి అనే నటుడు శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీరెడ్డి వ్యభిచారంకు పాల్పడ్డట్లుగా స్వయంగా ఒప్పుకుంది. అందుకే వెంటనే ఆమెను అరెస్ట్‌ చేయాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది.

శ్రీరెడ్డి తనపై తమిళ సినీ పరిశ్రమ వారు చేస్తున్న దాడిని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. తనను వ్యభిచారం కేసులో అరెస్ట్‌ చేసినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అవన్ని పుకార్లే అని, తనను అరెస్ట్‌ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. తాను వ్యభిచారం చేశాను అని, తానో వ్యభిచారిని అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నేను డబ్బులు తీసుకోని వ్యభిచారం చేయలేదు, నా వద్ద పడుకున్న వాడు ఏ ఒక్కడు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. నాతో పడుకున్న వాడు వ్యభిచారి అయితే మీ టూ అంటూ శ్రీరెడ్డి కామెంట్స్‌ చేసింది. శ్రీరెడ్డితో సెక్స్‌ చేసిన వారి జాబితా చాలా పెద్దదే అంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగు మరియు తమిళ సినీ ఇండస్ట్రీలో ఎంతో మందితో శ్రీరెడ్డి బెడ్‌ రిలేష్‌ పెట్టుకుంది. అందుకే ఆమెను వ్యభిచారి అంటూ కొందరు విమర్శిస్తున్నారు. కాని ఆమె మాత్రం తనను అనుభవించిన వారు వ్యభిచారులు అయ్యి, వారిని అరెస్ట్‌ చేస్తే నేను కూడా అంటూ నిర్మొహమాటంగా చెబుతోంది.