శైలజ రెడ్డి ఎవరో తేలిపోయింది

Sridevi Turns Naga Chaitanya's Aunt for Maruthi Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

వరుసగా బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లు అందుకుంటున్న దర్శకుడు మారుతి తాజాగా ‘మహానుభావుడు’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం మారుతి తన తర్వాత సినిమా పనిలో ఉన్నాడు. నాగచైతన్య హీరోగా మారుతి సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్‌ పైకి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ‘శైలజరెడ్డి’ అనే టైటిల్‌ను అప్పుడే ఖరారు చేయడం జరిగింది. టైటిల్‌తోనే సినిమా స్థాయిని పెంచేసిన దర్శకుడు మారుతి తన గత చిత్రాల కంటే చాలా విభిన్నంగా, హైలైట్‌గా చిత్రాన్ని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

sreedevi

ఈ చిత్రంలో శైలజరెడ్డి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే దర్శకుడు మారుతి ఆ పాత్ర కోసం ప్రముఖ నటిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీదేవిని ఈ పాత్ర కోసం మారుతి సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కథ విన్న తర్వాత శ్రీదేవి కూడా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యిందని, మరి కొన్ని రోజుల్లో ఆమె తన నిర్ణయాన్ని వెళ్లడి చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉన్న మారుతి ఈ చిత్రానికి శ్రీదేవి నో చెబితే టబును సంప్రదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నాగచైతన్యకు అత్తగా ఎవరు నటిస్తారా అని అక్కినేని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

sridevi