శ్రీలీల.. ఏంజిల్లా నువ్వు. ‘ఎక్స్ ట్రా’ అప్ డేట్!

tollywood actress srileela
srileela

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్’ రూపొందుతోంది. నితిన్ ఈ సినిమా ని తన సొంత బ్యానర్ పై నిర్మితమవుతోంది. వక్కంతం వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను, భారీ బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ కథలో నితిన్ సినిమాల్లో నటించే ఒక జూనియర్ ఆర్టిస్టుగా కనిపించనున్నాడు. ఆయన జోడీగా శ్రీలీల అలరించనుంది. ఈ ఇద్దరిపై చిత్రీకరించిన ఒక పాటకి సంబంధించిన ‘ప్రోమో’ను కొంత సేపటి క్రితం రిలీజ్ చేశారు. ‘డేంజర్ పిల్లా పిల్లా .. ఏంజిల్లా నువ్వు ..’ అంటూ ఈ పాట సాగుతోంది. హారీస్ జైరాజ్ కంపోజ్ చేసిన పాట ఇది.

మంచు కొండల నేపథ్యంలో …విదేశాల్లో సాగర తీరంలో ఈ పాటను చిత్రీకరించారు. ఆగస్టు 2వ తేదీన పూర్తి పాటను వదలనున్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నితిన్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉన్నపటికీ ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి