శృతి అమ్మమ్మ ఆలా ఎందుకు చేసిందో ?

Sruthi Hassan Grandmother Will

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇండియా వచ్చిన విదేశీ బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సెల్ తో చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్న శృతి హాసన్ కి ఆమె అమ్మమ్మే పోతూపోతూ పెద్ద షాక్ ఇచ్చింది. శృతి అమ్మమ్మ ఇటీవల చనిపోయారు. చనిపోయాక ఆమె రాసిన విల్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కుమార్తె సారిక, మనవరాళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ ఉన్నప్పటికీ ఆమె తన ఆస్తులు వారికీ పెట్టలేదు.

ముంబైలో వున్న ఇల్లు మొదలుకుని మొత్తం ఆస్తులన్నీ తన కుటుంబ స్నేహితుడు అయిన డాక్టర్ విక్రమ్ ఠాకూర్ కి సంక్రమించేలా శృతి అమ్మమ్మ విల్లు రాశారట. కూతురు, మనవరాళ్లని వదిలేసి శృతి అమ్మమ్మ అలా ఎందుకు చేసిందన్నది ఇప్పుడు పెద్ద చర్చ అవుతోంది. సారికతో పాటు శృతి, అక్షర కి ఆమె ఆస్తి మీద ఆధారపడే పరిస్థితి లేనప్పటికీ ఆమె ఇలా చేయడం మాత్రం వారికి కూడా షాకింగ్ గా ఉందట. శృతి అమ్మమ్మ ఇలా ఎందుకు చేసిందో మరి ?