లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌

లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌

దేశీ స్టాక్‌మార్కెట్‌లో క్రమంగా బేర్‌ పట్టు వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ గురువారం ఉదయం కూడా లాభాలతోనే మొదలైంది. సోమవారం రోజు మార్కెట్‌ క్రాష్‌ కావడంతో చిన్నా పెద్దా అన్ని కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. దీంతో అందుబాటు ధరలో ఉన్న షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుండటంతో క్రమంగా మార్కెట్‌లో జోష్‌ కనిపిస్తోంది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 57,251 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ పైకి ఎగబాకుతోంది. ఉదయం 9:20 గంటల సమయానికి 320 పాయింట్లు లాభపడి 57,251 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 17,041 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొనడంతో ఇటు నిఫ్టీ 17 వేల పాయింట్లను క్రాస్‌ చేయగా సెన్సెక్స్‌ 57 వేల పాయింట్లను దాటగలిగింది.