సుచిలీక్స్‌ మళ్లీ స్టార్ట్‌.. ఎలా వెళ్లానో అలాగే వచ్చా : సుచి

Suchi Leaks Starts again in kollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళ సింగర్‌ సుచిత్ర గత సంవత్సరం సుచిలీక్స్‌ పేరుతో ఏ స్థాయిలో దుమారంను రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌ మరియు టాలీవుడ్‌ స్టార్స్‌కు చుక్కలు చూపించిన సుచిలీక్స్‌ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్‌ సెలబ్రెటీల రహస్య వీడియోలు మరియు ఫొటోలను లీక్‌ చేసి సంచలనం సృష్టించిన సుచిత్ర ఆ తర్వాత తాను కాదు, తన ఆరోగ్యం బాగా లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె భర్త కార్తీక్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, సుచి ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దాంతో సుచికి లీక్స్‌కు సంబంధం లేదని అంతా భావించారు. కాని తాజాగా మళ్లీ సుచి స్వయంగా ట్వీట్‌ చేయడంతో ఆందోళన మొదలైంది. 

సుచిత్ర తాజాగా ట్విట్టర్‌లో ‘ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా, నటీనటులు అంతరంగిక వ్యవహారాలు, సెలబ్రెటీల రహస్య సంబంధ వీడియోలు విడుదల కానున్నాయి’ అంటూ పోస్ట్‌ చేసింది. ఈ ట్వీట్‌తో ఏం జరగబోతుందో అనే అందోళన తమిళ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సుచిలీక్స్‌ వ్యవహారం కామ్‌గా ఉన్నా ఎప్పుడు బ్లాస్ట్‌ అవుతుందో అనే ఆందోళన అందరిలో కనిపిస్తుంది. మొత్తానికి సుచిలీక్స్‌ వల్ల కోలీవుడ్‌ సినిమా పరిశ్రమలో ఒక నిశబ్ద వాతావరణం కనిపిస్తుంది. సుచిలీక్స్‌ మళ్లీ విడుదల కాకుండా ఉండేందుకు కోలీవుడ్‌ వర్గాల వారు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. నెటిజన్‌లు మాత్రం సుచిత్ర ట్విట్టర్‌ పేజీలో ఆసక్తిగా చూస్తున్నారు.