మోడీలా మాట్లాడిన ట్రంప్

Donald Trump imitates Narendra Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఎంత ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తో మ‌రోసారి నిరూపించుకున్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్ పై అమెరికా విధానాన్ని గురించి చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఉప‌యోగించిన భాష‌పై వాషింగ్ట‌న్ పోస్ట్ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించింది. అఫ్ఘ‌న్ అధికారుల‌తో మాట్లాడటానికి ట్రంప్ భార‌త ప్ర‌ధాని మోడీ ఇంగ్లీష్ యాస‌ను ఉప‌యోగించిన‌ట్టు ఆ క‌థ‌నం పేర్కొంది. గ‌త ఏడాది ఓవ‌ల్ ఆఫీసులో మోడీతో ట్రంప్ స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో మోడీ మాట‌తీరును ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించిన ట్రంప్ అఫ్ఘాన్ అధికారుల‌తో భార‌త ప్ర‌ధానిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. త‌ను మాట్లాడే విష‌యం వారికి మ‌రింత బాగా అర్దం కావాలన్న ఆలోచ‌నతోనే ట్రంప్ ఇలా చేశార‌ని వాషింగ్ట‌న్ పోస్ట్ తెలిపింది. త‌న స‌మావేశంలో ఆఫ్ఘాన్ సంక్షేమం కోసం అమెరికా చేస్తున్న ఖ‌ర్చు గురించి కూడా ట్రంప్ కీల‌క వ్యాఖ్య చేశారు.

ఆఫ్ఘ‌న్ కోసం అమెరికా ఎంతో ఖ‌ర్చుపెట్టింద‌ని, అందుకు ప్ర‌తిఫ‌లంగా పొందింది చాలా త‌క్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. మ‌రే దేశం కూడా ప‌రాయిదేశం బాగుకోసం అంత ఖ‌ర్చుపెట్ట‌లేద‌న్నారు. అటు ట్రంప్ మోడీని ఇమిటేట్ చేయ‌డంపై వైట్ హౌస్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ట్రంప్ ఇలా ఇత‌రుల‌ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌త ఏడాది అక్టోబ‌రులో మారియా తుఫాన్ బాధితుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్యూర్టోరికా యాస‌లో మాట్లాడారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో భార‌త కాల్ సెంట‌ర్ ఉద్యోగిని ఇమిటేట్ చేయ‌డంతో ట్రంప్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆయ‌నో మిమిక్రీ ఆర్టిస్టులా ప్ర‌వ‌ర్తిస్తున్నాని ప‌లువురు విమ‌ర్శించారు