భారత్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో మోదీ..వీడియో వైరల్

Modi in the dressing room of the Indian team..the video has gone viral
Modi in the dressing room of the Indian team..the video has gone viral

భారతజట్టు వరల్డ్ కప్ ఓటమి తర్వాత భావిద్వేగానికి లోనవగా…. వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లీతో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపు ఓటములు సహజం…. మీరు పోరాడారంటూ టీమును అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావు’ అంటూ ద్రవిడ్ ను పలకరించిన మోదీ…. చాలా బాగా ఆడావు అంటూ షమీని హత్తుకున్న వీడియోను బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసింది.

కాగా, వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంత అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారుల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది.