అబ్బో… నిజమేనా బాబు?

Sudheer Babu says about Mahesh Babu Support for his films

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు బావ అయిన సుధీర్‌బాబు హీరోగా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సక్సెస్‌, ఫ్లాప్‌లతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా, సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కెరీర్‌ ఆరంభించి చాలా యేళ్లు అయ్యింది. అయినా కూడా ఇప్పటి వరకు సుధీర్‌ బాబు మంచి సాలిడ్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రాల్లో కేవలం ‘ప్రేమ కథాచిత్రమ్‌’ మాత్రమే సక్సెస్‌ను దక్కించుకుంది. మిగిలిన అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథలను ఈయన ఎంచుకుంటున్న కారణంగా సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయని, మహేష్‌బాబు, కృష్ణలు వెనుక ఉండటం వల్ల హీరోగా ఆఫర్లు వస్తున్నాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి మహేష్‌బాబు తన బావను నెట్టుకు వస్తున్నాడు.

మహేష్‌బాబు వల్లే తాను ఇండస్ట్రీలో ఉంటున్నట్లుగా కొందరు చెబుతున్నారు. ఆ విషయంను నేను ఒప్పుకోను. నాకు సినిమాలు అవసరం లేదు, బిజినెస్‌ ఉన్నా కూడా ప్యాషన్‌తో సినిమాను చేస్తున్నాను. మహేష్‌బాబు నా సినిమాల ప్రమోషన్‌కు వస్తాడు తప్ప అవకాశాలు ఇప్పించడు అని, నా ప్రతిభ ఆధారంగా సినిమాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో సార్లు మంచి ఆఫర్లు బాలీవుడ్‌ నుండి కూడా వచ్చాయని, కాని తాను అక్కడకు వెళ్లడం ఇష్టం లేక నో చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌లో సుధీర్‌బాబు ‘బాఫీు’ చిత్రంలో నటించాడు. ఆ సినిమాలో నటనకు గాను దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంప్రెస్‌ అయ్యి తాను చేయబోతున్న ఒక భారీ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ను ఆఫర్‌ చేశాడు. మంచి పారితోషికంతో పాటు, మంచి పాత్రను ఆఫర్‌ను చేసినా కూడా తెలుగులోనే నటించాలనే ఉద్దేశ్యంతో అక్కడకు వెళ్లలేదు అంటూ సుధీర్‌బాబు చెప్పుకొచ్చాడు. మొత్తానికి సుధీర్‌బాబు గొప్పలు చెప్పుకుంటూ, తన కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు.