నటుడు సునీల్ మృతి…క్లారిటీ ఇచ్చిన సునీల్ !

టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని పేర్కొన్నారు. సునీల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఓ వెబ్‌సైట్‌ తప్పుడు వార్తను ప్రచురించింది. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. టాలీవుడ్‌ లో కూడా కలకలం రేగింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయిందని, సునీల్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారని ఈ వార్తను బేస్ చేసుకుని కొంత మంది సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెట్టారు. దీంతో ఈ వార్తలపై సునీల్ క్లారిటీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్టు వస్తున్న వార్తలను నమ్మొద్దని అభిమానులను సునీల్ కోరారు. ‘నేను ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యానని వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. అది పూర్తిగా తప్పుడు వార్త. ఎవరో తన వ్యూస్ పెంచుకోడానికి ఈ నీచమైన పని చేసినట్టుంది. మీ ఆశీస్సులతో నేను క్షేమంగా ఉన్నా.. దయచేసి ఆందోళన చెందొద్దు. ఆ వార్తలను నమ్మొద్దు’ అని సునీల్‌ ట్వీట్‌ చేశారు.నటుడు సునీల్ మృతి...క్లారిటీ ఇచ్చిన సునీల్ ! - Telugu Bullet