అనుష్క కోసం తెలుగులో ప్రభాస్‌, తమిళంలో సూర్య

Surya's-partner-in-the-Tami

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క ‘బాహుబలి’ తర్వాత ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ విడుదలకు ముందే అనుష్క ‘భాగమతి’ని ప్రారంభించింది. కాని చిత్రం షూటింగ్‌ మరియు విజువల్‌ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన విషయాల్లో కాస్త ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయిన ‘భాగమతి’ ట్రైలర్‌ ఇటీవలే రిలీజ్‌ అయ్యింది. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. హర్రర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అనుష్కకు మరో ‘అరుంధతి’ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో చెబుతున్నారు. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సౌత్‌లో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు కాస్త తక్కువ ఆధరణ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ కాస్టింగ్‌ ఉండదు కనుక సినిమా సక్సెస్‌ అయితేనే కలెక్షన్స్‌ వచ్చే వీలు ఉంటుంది. కాని అనుష్క సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ను తెచ్చేందుకు తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం తమిళ వర్షన్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సూర్య భాగస్వామి అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్‌తో సూర్యకు మంచి సన్నిహిత్యం ఉంది. ఇక తెలుగులో యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలకు ఆప్త మిత్రుడు అయిన ప్రభాస్‌ ఎలాగూ ఉండనే ఉన్నాడు.

తెలుగులో ఇప్పటికే ‘భాగమతి’ సినిమా ప్రమోషన్‌ను ప్రభాస్‌ మొదలు పెట్టాడు. ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు ఈ చిత్రంలో ప్రభాస్‌, సూర్యలు నటించారు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. తెలుగు వర్షన్‌లో గెస్ట్‌ రోల్‌లో ప్రభాస్‌, తమిళ వర్షన్‌లో అదే పాత్రను సూర్యతో చేయించారు అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలైతే కాని అసలు విషయం తెలియదు. ప్రస్తుతానికి అయితే సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి.