సాహో కి పోటాపోటీ అంటున్న సైరా

సాహో కి పోటాపోటీ అంటున్న సైరా

ఇంకో  వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘సైరా’ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. అది అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక మొన్న జరిగిన ఈవెంట్ లో చిరంజీవి సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇది మామూలు సినిమా కాదని, ఎంతో ప్రాణప్రదంగా తీసిన సినిమా అంటూ చెపుతూ, అందులోని ఒక ఎపిసోడ్ గురించి స్పెషల్ గా చెప్పాడు. అదేమిటంటే ఒక పోరాట సన్నివేశం కోసం జార్జియాలో దాదాపు మూడువేల మందితో ఒక భారీ యుద్ధ సన్నివేశం తెరకెక్కించారని చెప్పాడు.

ఈ ఒక్క పోరాట సన్నివేశం దాదాపు నెలన్నర రోజులు షూట్ చేశారని, దాని కోసం 70 కోట్లు పైగా ఖర్చుపెట్టారని చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తం మీద హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ బలంగా చెపుతుంది. మొన్న వచ్చిన సాహో సినిమాలో కూడా అబుదాబిలో జరిగిన ఫైట్ సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చుపెట్టారు. అది సాహో సినిమాకే హైలైట్ అని చెప్పుకునే సన్నివేశంగా ఉంది.

ఇప్పుడు సైరాలో కూడా అంతే ఖర్చుతో, అంతకంటే ఎక్కువగా కష్టపడి తీసిన ఈ పోరాటాలు కూడా మెప్పిస్తానేది చిత్ర యూనిట్ మాట.. ఒక్క పోరాట సన్నివేశం కోసం 70 కోట్లు అంతే మాములు విషయం కాదు.