సైరా మొదటి షెడ్యూల్‌ ఇలా పూర్తయ్యింది

sye raa movie First schedule complete

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చిరంజీవి ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి కెరీర్‌లో 151వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. దాదాపు 100 కోట్లకు పై బడిన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. ఆరు నెల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయినప్పటికి రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. చిరంజీవి లుక్‌ ఫైనల్‌ అవ్వని కారణంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లింది.

syeraa

మొదటి షెడ్యూల్‌లో ఈ చిత్రంకు సంబంధించిన కీలక యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్స్‌ కొరియోగ్రఫర్‌ సారధ్యవంలో యాక్షన్‌ సీన్స్‌ను షూట్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొదటి షెడ్యూల్‌లో కీలక నటీనటులు పాల్గొన్నారు. రెండవ షెడ్యూల్‌ వివరాలను త్వరలోనే వెళ్లడి చేయబోతున్నారు. రెండవ షెడ్యూల్‌ కూడా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామానాయుడు స్టూడియో మరియు రామోజీ ఫిల్మ్‌ సిటీలో సెట్స్‌ వేస్తున్నారు.

chiranjeevi

ఆ సెట్స్‌లో ఎక్కువ శాతం చిత్రీకరణ చేయాలని నిర్ణయించారు. చిరంజీవి లుక్‌ బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2018 చివర్లో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా నయనతార ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ రికార్డును సైరా బద్దు కొట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.