సైరా… ఇదైనా ఫైనలేనా?

Sye Raa Narasimha Reddy shooting second schedule details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యి నెలలు గడుస్తుంది. రెండవ షెడ్యూల్‌ను అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. రెండవ షెడ్యూల్‌కు ‘రంగస్థలం’ చిత్రం అడ్డు వస్తుందని ఒక సారి, స్టార్స్‌ డేట్లు ఖరారు కాలేదు అని మరోసారి చెబుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. తాజాగా రంగస్థలం చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఈ నేపథ్యంలో ‘సైరా’ చిత్రం రెండవ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈనెల 20 నుండి రెండవ షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుందని, ఈ షెడ్యూల్‌లోనే అమితాబచ్చన్‌తో పాటు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

‘రంగస్థలం’ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ‘సైరా’ చిత్రాన్ని 20 నుండి చిత్రీకరణ మొదలు పెడితే మళ్లీ సినిమా విడుదల సమయంలో ఆగాల్సి రావచ్చు అని, నిర్మాత రామ్‌ చరణ్‌ మరియు దర్శకుడు సుకుమార్‌లు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో సైరా చిత్రీకరణ జరిగితే చరణ్‌ పాల్గొనే అవకాశం ఉండదు. కీలక సన్నివేశాలు నిర్మాత లేకుండానే చిత్రీకరిస్తారనేది అనుమానమే. అందుకే ఈనెల 20న రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అయ్యే అవకాశం లేదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సైరా చిత్రీకరణ ఈసారైనా జరిగేనా అంటూ మెగా ఫ్యాన్స్‌ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.