లుక్‌ లీక్‌ చేసి, ‘బాహుబలి’ అంటున్నారు!

Syeraa Movie Leaked Look Like Baahubali Movie Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. చిరంజీవి లుక్‌ ఎలా ఉంటుంది అంటూ చాలా రోజులుగా మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టి అమితాబచ్చన్‌ ద్వారా చిరు లుక్‌ను రివీల్‌ చేయించారు. చిత్రంలోని చిరంజీవి లుక్‌ను అధికారికంగా విడుదల చేయనప్పటికి చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ లుక్‌పై ప్రశంసలు అందుకుంటున్నారు. అమితాబచ్చన్‌ పోస్ట్‌ చేసిన స్టిల్‌లో చిరంజీవి వయస్సు చాలా తక్కువగా కనిపిస్తుందని, ‘బాహుబలి’లో ప్రభాస్‌ మాదిరిగా చిరంజీవి కనిపిస్తున్నాడు అంటూ టాక్‌ వినిపస్తుంది. 

‘సైరా’లో చిరు లుక్‌కు వస్తున్న ప్రశంసలతో చిత్ర యూనిట్‌ సభ్యులు తడిసి ముద్ద అవుతున్నారు. సినిమా ఆశించిన స్థాయిని మించి ఉంటుందని స్టిల్స్‌ చూస్తే అర్థం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మెగా ఫ్యాన్స్‌ కావాలని బాహుబలిలా మెగాస్టార్‌ ఉన్నాడని, ఇరవై ఏళ్లు తగ్గి చిరంజీవి కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు కావాలని స్టిల్‌ను లీక్‌ చేసి సినిమాపై అంచనాలు పెరిగేలా ప్లాన్‌ చేశారు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాదారణంగా కంటే తాజాగా చిరంజీవి లుక్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చిందని, దాంతో పాటు సినిమాపై అంచనాలు డబుల్‌ అయ్యాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి మెగా వర్గం చేసిన పని వల్ల సినిమా క్రేజ్‌ అమాంతం పెరిగి, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

లుక్‌ లీక్‌ చేసి, ‘బాహుబలి’ అంటున్నారు! - Telugu Bullet