అబ్బాయి టీంకు బాబాయి టీం ప్రశంసలు

Pawan Kalyan Tweets On Rangasthalam Movie and Ram Charan Acting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ టాక్‌ను దక్కించుకున్న రంగస్థలం కలెక్షన్స్‌లో కూడా దూకుడు చూపిస్తుంది. టాప్‌ 5 చిత్రాల జాబితాలో చరణ్‌ నిలవడం ఖాయం అని తేలిపోయింది. ఇక ఈ చిత్రం సక్సెస్‌ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ టీం నుండి రామ్‌ చరణ్‌ మరియు రంగస్థలం టీమ్‌కు శుభాకాంక్షలు అందాయి. తన సినిమాల గురించి విశేషాలను తెలియజేయడం కోసం పవన్‌ ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ అనే అకౌంట్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో మొదటిసారి చరణ్‌ గురించి పోస్ట్‌ చేయడం జరిగింది. 

రంగస్థలం చిత్రంలో రామ్‌ చరణ్‌ నటన అద్బుతంగా ఉందని పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ తరపున ట్వీట్‌ చేయడం జరిగింది. మామూలుగా అయితే ఈ అకౌంట్‌ నుండి స్వయంగా పవన్‌ పేరుతో ట్వీట్స్‌ వస్తాయి. కాని ఈసారి మాత్రం టీం అంటూ ట్వీట్‌ రావడం జరిగింది. ఇటీవలే అబ్బాయి చరణ్‌కు స్వయంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పవన్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా తన శుభాకాంక్షలను అందించడం జరిగింది. త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో చరణ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయి అంటూ వస్తున్న వార్తలకు ఇది ఊతం ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్‌ నటనతో పాటు సమంత, ఇతర నటీనటుల నటన అద్బుతం అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.