ఇక్కడ తప్పు.. అక్కడ ఒప్పా?

taapsee-is-acting-almost-nude-for-a-movie-in-bollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయిన తాప్సి పలు సినిమాల్లో నటించి అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్‌ హీరోయిన్‌ అవ్వలేక పోయింది. కొన్నాళ్లపాటు తెలుగులో కొనసాగి మెల్ల మెల్లగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్‌ అయ్యింది. బాలీవుడ్‌లో ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. అదే సమయంలో తాజాగా తెలుగులో ‘ఆనందోబ్రహ్మా’ అనే ఒక హర్రర్‌ కామెడీ సినిమాను చేయడం జరిగింది. ఆ సినిమా సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుము చుట్టు కెమెరాలు పెట్టి హీరోయిన్‌ను పండ్లతో, కాయలతో కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో హీరోయిన్స్‌ అంటే కేవలం గ్లామర్‌ డాల్స్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమా పరిశ్రమను అవమానపర్చే విధంగా ఈ అమ్మడు మాట్లాడి అందరికి షాక్‌ ఇచ్చింది.ఆ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దర్శకుడు రాఘవేంద్ర రావుతో పాటు, సినీ పరిశ్రమకు క్షమాపణలు చెప్పింది.

ఇక్కడ తప్పు.. అక్కడ ఒప్పా? - Telugu Bullet

అందాల ప్రదర్శణ అంటూ శ్రీరంగ నీతులు చెప్పిన తాప్సి ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక సినిమా కోసం దాదాపు నగ్నంగా నటిస్తోంది. టూ పీస్‌ బికినీతో పాటు లెక్కకు మించిన ముద్దు సీన్‌లు ఆ సినిమాలో ఉంటాయట. ఇక్కడ కేవలం నడుము చూపిస్తేనే విమర్శలు చేసిన తాప్సి అక్కడ బికినీ వేసి ముద్దు సీన్స్‌ను ఎలా చేస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు తాప్సి ఏం సమాధానం చెబుతుందో చూడాలంటే ఆమె మరో తెలుగు సినిమా చేసేంత వరకు ఎదురు చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా..

మోక్షజ్ఞ లవ్ స్టోరీ కి అతనే కర్త,కర్మ,క్రియ ?