మతం మార్చుకున్న మరో మ్యూజిక్ డైరెక్టర్…!

Tamil Actor Simbu Brother Kuralarasan Converts To Islam

సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఏఆర్ రెహ‌మాన్, యువ‌న్ శంక‌ర్ రాజా వంటి సంగీత ప్ర‌ముఖులు ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించ‌గా ఇప్పుడు వారి కోవలోనే కోలీవుడ్ హీరో శింబు సోద‌రుడు, సంగీత దర్శకుడు కుర‌ళ‌ర‌స‌న్ కూడా ఇస్లాం మతం స్వీకరించాడు. బాల న‌టుడిగా ప‌లు చిత్రాల‌లో న‌టించి కుర‌ళ‌ర‌స‌న్ శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆలు సినిమాతో సంగీతదర్శకుడిగా మారారు. వారి తండ్రి సీనియర్‌ దర్శక, నిర్మాత, నటుడు టీ రాజేందర్‌ అన్న సంగతి తెలిస్న్దే. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు కాగా ఆయన కూతురు అలేఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు.

తాజాగా కురళరసన్‌ ఇస్లాం మతం స్వీకరించారు. అయితే ఓ ముస్లిం యువ‌తిని ప్రేమిస్తున్న కార‌ణంగానే కుర‌ళ‌ర‌స‌న్ ఇస్లాం మ‌తంలోకి మారాడ‌ని ఆమెతో వివాహం కోసమే ఆయన మతం మారుతున్నారని కోలీవుడ్‌లో ప్ర‌చారం మొదలయ్యింది. చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మ‌తం స్వీక‌రించ‌గా ఈ కార్య‌క్ర‌మానికి తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. అయితే త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీ నుండి మ‌తం మార్చుకొని ఇస్లాం మ‌తంలోకి వెళ్లిన మూడవ వ్య‌క్తి కుర‌ళ‌ర‌స‌న్ కావ‌డం విశేషం.