న్యూయార్క్‌ సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న తమన్నా

న్యూయార్క్‌ సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న తమన్నా

ప్రస్తుతం న్యూయార్క్‌ సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. ‘ది రంగ్ షో’లో భాగంగా న్యూయార్క్ వెళ్లిన తమన్నా.. రద్దీగా ఉండే టైమ్ స్క్వేర్ వద్ద ఒక క్రియేటివ్ ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోషూట్‌లోని కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో  తమన్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ తలపెట్టిన ‘కావేరీ కాలింగ్’ సామాజిక కార్యక్రమానికి నిధులు చేకూర్చడంలో భాగంగా చేపట్టిన ‘ది రంగ్ షో’లో తమన్నా పాలుపంచుకుంది. మలైకా అరోరా, రెమో డిసౌజాలతో కలిసి ఈ మ్యూజికల్ డ్యాన్స్ షోలో తమన్నా పాల్గొంది. ఇక, సినిమాల విషయానికి వస్తే తమన్నా ప్రస్తుతం ‘సైరా’లో నటించింది. తాజాగా విడుదలైన ‘సైరా’ ట్రైలర్‌లో ఆమె లక్ష్మి పాత్రలో కనిపించింది. మొత్తం మీద ‘బాహుబలి’ తరవాత మళ్లీ అలాంటి చిత్రంలో తమన్నా ఒక పాత్రలో నటించింది.