బాలీవుడ్ లో టాక్సీవాలా

బాలీవుడ్ లో టాక్సీవాలా

రిలీజ్‌కు ముందే పైరసీ అయినప్పటికీ మంచి విజయం సాధించింది “టాక్సీవాలా” సినిమా. ఈ సినిమా హిందీ లో రీమేక్‌గా బాలీవుడ్లో రానుందని సమాచారం.షాహిద్‌కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ట్టర్‌ కథానాయకుడిగా ఈ రీమేక్ రానుంది. “కాలీ పీలీ” అని పేరు ఖరారు చేశారు.

పాతకారు, అందులో దెయ్యంఅనే కాన్సెప్ట్‌ తో విజయ్‌ దేవరకొండ నటించిన టాక్సీవాలా 2018 లో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విడుదల అయింది. బాలీవుడ్ లో మక్బూల్‌ ఖాన్‌ దర్శుకుడు. ప్రియాంక జవాల్కర్ తెలుగు లో కథానాయికగా నటించగా అనన్యా పాండే బాలీవుడ్ లో హీరోయిన్‌గా నటించనుంది.

తెలుగులో యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ కలిసి నిర్మించాయి. రీమేక్ వ వస్తున్న సినిమాలో కూడా ప్రధాన పాత్ర టాక్సీ దే. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్‌ చేయనున్నట్టు సమాచారం.