రాంబాబు ఈసారైనా వచ్చేనా?

Ungarala Rambabu 2017 Telugu Movie,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sunil New Movie  Ungarala Rambabu Will Be Release Soon

కమెడియన్‌ నుండి హీరోగా టర్న్‌ అయిన సునీల్‌ అప్పటి నుండి కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఆ మద్య వరుసగా ఫ్లాప్‌లు రావడంతో సునీల్‌ క్రేజ్‌ తగ్గిపోయింది. సునీల్‌ నటించిన సినిమా విడుదల అవ్వడమే గగనం అయ్యింది. తాజాగా సునీల్‌ నటించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే గత సంవత్సరంలోనే విడుదల అవ్వాల్సి ఉంది. కాని ఏవో కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా మరోసారి చిత్ర విడుదల తేదీని యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఈనెల చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసి తీరుతాం అంటూ నిర్మాత పేర్కొన్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు మరియు టీజర్‌ సినిమా పరమ రొటీన్‌గా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాయి. సినిమాపై పెద్దగా అంచనాలు ఏమీ లేవు. దాంతో కనీసం కలెక్షన్స్‌ అయినా వస్తాయా అనే నమ్మకం లేదు. సునీల్‌ హీరోగా కెరీర్‌ ఖతం అయినట్లే అని, ఇకనైనా మళ్లీ కామెడీ వేశాలు వేసుకోవాల్సిందిగా ఆయన సన్నిహితులు మరియు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఉంగరాల రాంబాబు సినిమా తర్వాత సునీల్‌ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. అది చూడాలి అంటే మరో రెండు వారాలు ఆగాలన్నమాట.

మరిన్ని వార్తలు:

దీంతో నాని స్టార్‌ హీరో అయినట్లే..!

బుల్లి తెరపై మెప్పిస్తాడా అన్న ప్రశ్నకు ఇదే సమాధానం