బాబాయి చేస్తే బ్రహ్మాండం

ntr happy with balakrishna role in ntr biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. స్వయంగా బాలయ్య ఆ విషయాన్ని ప్రకటించాడు. అయితే బాలయ్య ఎప్పుడు ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సమయంలోనే వర్మ తాను ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో సినిమాను చేస్తాను అంటూ ప్రకటించాడు. రెండు పార్ట్‌లుగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ తాతగారి జీవిత చరిత్ర చిత్రంపై స్పందించాడు. 

త్వరలో ‘బిగ్‌బాస్‌’ షో ప్రారంభం కాబోతుంది. ఆ షోకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి కొత్త టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. టీజర్‌ విడుదల కార్యక్రమంలో మీడియాతో ఎన్టీఆర్‌ ఇంటరాక్ట్‌ అయ్యారు. ఆ సమయంలోనే తాతగారు ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా బాలయ్య సినిమా తీయాలని భావిస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి అంటే ‘బ్రహ్మాండం’ అంటూ ఒక్క మాటతోనే ఎన్టీఆర్‌ తేల్చి చెప్పేశాడు. ఆ సినిమాలో మీరు ఉంటారా అని ప్రశ్నించగా అందుకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. ఇక వర్మ తీయబోతున్న సినిమాపై కూడా ఎన్టీఆర్‌ స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు.

మరిన్ని వార్తలు