వైకాపా ప్లీనరీలో వైసీపీ లీడర్స్ డైలాగ్స్ …

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

nagi-reddy

రైతు విభాగం ప్రెసిడెంట్‌, వైసిపి నేత ఎంవీఎస్‌ నాగిరెడ్డి వైకాపా ప్లీనరీలో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టారు. నాగిరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బలపరిచారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనతో రైతులు దిక్కులేనివారయ్యారని, చంద్రబాబు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేశారని విమర్శించారు.

 

నేత అవినీతిపై పుస్తకం రావడం ఇదే మొదటిసారి అయి ఉంటుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతిచోట అవినీతేనని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారంతా అవినీతి పరులుగా మారిపోయారన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని, ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో మరో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అవినీతి గురించి చెప్పడానికి ఒక్క ప్లీనరీ సరిపోదనే ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్లుగా ఆయన చెప్పారు.

ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గుంటూరు వేదికగా జరుగుతున్న వైసిపి జాతీయ ప్లీనరీ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఆ తీర్మానాన్ని బలపరిచారు.  

2019లో అధికారంలోకి వచ్చేది వైసిపినే అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుంటూరు ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ పేరు చెప్పి చంద్రబాబు దొంగహామీలిచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఒక్క వైసిపికే 44 శాతం ఓట్లు వచ్చాయని, గుడివాడలో ఈసారి 42 శాతం ఓట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 ఏపీకి చంద్రబాబు కొత్తరాజ్యాంగం రాశారని విజయవాడ నగర వైసిపి అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పెద్దిరెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగిస్తున్న ఆయన ఐవైఆర్‌ కృష్ణారావుపై టిడిపి అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిందని, ప్రజలకోసం పోరాడే వారిపై అక్రమ కేసు పెడుతున్నారని అన్నారు. రంగా హత్య నుంచి నారాయణరెడ్డి హత్య వరకూ చంద్రబాబు కారణమా? కాదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీ పరువు తీశారని దుయ్యబ ట్టారు.
వైకాపా ప్లీనరీలో వైసీపీ లీడర్స్ డైలాగ్స్ ... - Telugu Bullet

చంద్రబాబు పెద్ద ఫ్యాక్షనిస్ట్‌ అని, బిహార్‌ – యూపీ కంటే ఘోరమైన పాలన ఏపీలో జరుగుతోందని, చంద్రబాబు పాలనకు అంతం పలకాలని వెసిపి ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మైనింగ్‌ను దోచుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారన్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు

చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని వైసిపి ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 41 మంది వైసిపి కార్యకర్తలను హతమార్చిందని టిడిపిపై విమర్శలు చేశారు. తహశీల్దార్‌ వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే దాడి చేసినా, అధికారుల నివేదికను బుట్టదాఖలు చేశారని ఇన్ని చేస్తున్నా టిడిపి దందాలను చూసి చూడనట్లు పోవాలని ఏకంగా సీఎమ్మే కలెక్టర్లకు చెప్పారని ఆయన అన్నారు. పోలీసులు, కలెక్టర్లు ఉన్నది ప్రభుత్వం చెప్పించి చేయడానికా..? న్యాయం చేయడానికా..? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టింది చాలక ఎమ్మెల్యే రోజాను కూడా వేధిస్తున్నారని, చంద్రబాబు పాలనంతా కూడా హత్యలు, కేసులమయమన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మేరుగ నాగార్జున ప్రజాసంక్షేమంపై ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం వైఎస్సార్‌ అని కొనియాడారు. ప్రజల ధన, మానాలతో టిడిపి ఆడుకుంటోందని, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరుతో మహిళలను వేధించారని ఆయన గుర్తుచేశారు. దళిత, గిరిజన వ్యతిరేక సీఎం చంద్రబాబు, ఎస్సీ, ఎస్టీల భూములను ఆయన లాక్కుంటున్నారని నాగార్జున విమర్శించారు. నాగార్జున ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే బాలరాజు బలపరిచారు.