రాజుగారి గదిలో కాజల్‌ ఏం చేస్తుంది?

kajalagarwal Guest Role Appearance In Raju Gari Gadhi 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kajal Agarwal Guest Role Appearance In Raju Gari Gadhi 2

బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్‌ అయిన ‘రాజుగారి గది’ చిత్రంను బేస్‌ చేసుకుని తెరకెక్కిన మరో చిత్రం ‘రాజుగారి  గది 2’. ఈ చిత్రంలో నాగార్జున మరియు సమంతలు ముఖ్య పాత్రలో నటించారు. నాగార్జునకు జోడీగా సీరత్‌ కపూర్‌ నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల సినిమాను రీషూట్‌ చేయడం జరిగింది. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ నటించిందనే ప్రచారం జరుగుతుంది. 

కాజల్‌ అగర్వాల్‌ కొన్ని ముఖ్యమైన సీన్స్‌లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తుందని, కీక పాత్ర అవ్వడంతో నిడివి తక్కువగా ఉన్నా కూడా కాజల్‌ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సమంత, కాజల్‌లు కలిసి బృందావనం వంటి చిత్రంలో నటించి మెప్పించారు. మళ్లీ వీరి కాంబోలో సినిమా వస్తుండటం సెంటిమెంట్‌ పరంగా కూడా వర్కౌట్‌ అవుతుందని ప్రేక్షకులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. నాగార్జున మరియు సమంతలు నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి, ఇక ఇదే సినిమాలో కాజల్‌ కూడా నటిస్తుండటంతో ఆ అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

దీంతో నాని స్టార్‌ హీరో అయినట్లే..!

రాంబాబు ఈసారైనా వచ్చేనా?