తెలియదట.. ఎన్టీఆర్‌ మాటలు నమ్మొచ్చా?

NTR says I don't no contestant celebrities in maa tv big boss show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ షోకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ నేడు హైదరాబాద్‌లో నిర్వహించారు. పుణెలోని ఒక బిగ్‌ హౌస్‌లో ఈ షోను నిర్వహించబోతున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. ఇక ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయం ప్రేక్షకులతో పాటు కనీసం ఎన్టీఆర్‌కు కూడా తెలియదట. ఈ విషయం స్వయంగా ఎన్టీఆర్‌ చెప్పాడు. తనకు కూడా ఇప్పటి వరకు ఆ సెలబ్రెటీలు ఎవరు అనే విషయాన్ని నిర్వాహకులు చెప్పలేదని ఎన్టీఆర్‌ అన్నాడు. 

ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయబోతున్న బిగ్‌బాస్‌ షోలో కనిపించబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయం ఎన్టీఆర్‌కు తెలియదు అంటే నమ్మేవారు ఎవరు లేరు ఇక్కడ. ఎన్టీఆర్‌ ఎవరిని అయితే చెబుతాడో వారినే స్టార్‌ మావారు సెలక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ స్టార్‌ హీరో కనుక, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్టీఆర్‌ చేస్తున్నాడు కనుక ఎవరిని పడితే వారిని తీసుకుంటే ఎన్టీఆర్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుంది. అందుకే స్టార్‌ మా వారు ఎంపిక చేసిన వారికి ఖచ్చితంగా ఎన్టీఆర్‌ ఓకే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఫైనల్‌ లిస్ట్‌లో ఉంటారు. కాని ఎన్టీఆర్‌ మాత్రం ఇప్పటి వరకు తాను మళ్లీ మళ్లీ అడిగినా కూడా వారు సెలబ్రెటీలు ఎవరు అనే విషయం చెప్పలేదు అంటున్నాడు. ఎన్టీఆర్‌ మాటల్లో నిజం ఎంతో స్టార్‌ మా వారికి మరియు ఆయనకే తెలియాలి.

మరిన్ని వార్తలు