సుకుమార్‌ కామెంట్స్‌తో మెగా ఫ్యాన్స్‌లో జోష్‌

Director Sukumar Talking About Ram Charan Performance In Rangasthalam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Director Sukumar Talking About Ram Charan Performance In Rangasthalam

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ‘ధృవ’ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాలో చరణ్‌ విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఇంకా అధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. అయినా కూడా ఇప్పటికే విడుదలైన లీక్‌ ఫొటోలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక తాజాగా దర్శకుడు సుకుమార్‌ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు పిచ్చేకేలా చేస్తున్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనేంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా సుకుమార్‌ నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ అనే చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన అదే సమయంలో చరణ్‌ మూవీ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు చూడని చరణ్‌ను చూడబోతున్నారు, ఖచ్చితంగా చరణ్‌ కెరీర్‌లో తాను తెరకెక్కిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం నిలిచి పోతుందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు సుకుమార్‌ సహజంగా తన సినిమాల గురించి ఆ స్థాయిలో మాట్లాడడు. ఆయన చెప్పకుండానే భారీ చిత్రాలను చేశాడు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఖుషీని అందిస్తున్నాయి. చరణ్‌ మూవీ టాలీవుడ్‌ రికార్డులను షేక్‌ చేయడం ఖాయం అంటూ ఇప్పటి నుండే మెగా ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

రాజుగారి గదిలో కాజల్‌ ఏం చేస్తుంది?