తేజ్ ఐ లవ్యూ – జులై 6 విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఈ సినిమా ఈ నెల‌ 6న విడుద‌ల‌వుతుంది. ‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్‌’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘చిన్నదాన నీకోసం’ వంటి రొమాంటిక్‌ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ రూపొందుతోంది. పవన్ కళ్యాణ్‌కు ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన కరుణాకరన్.. తేజూకు కూడా మంచి హిట్‌తో బ్రేక్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘ఇంటిలిజెంట్’ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సాయిధరమ్ ప్రేమకథను ఎంచుకున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్రం ఫస్ట్‌లుక్ మంచి స్పందన వచ్చింది. కరుణకారన్ స్టైల్లో ఫీల్‌గుడ్ థీమ్‌తో ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. చిత్రానికి అనుపమ మరో ప్లస్ అనే చెప్పాలి.

నటీనటులు : సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు
లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు,
స్టంట్స్‌: వెంకట్‌,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌,
చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు,
ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌,
ఆర్ట్‌: సాహి సురేశ్‌,
సంగీతం: గోపీ సుందర్‌,
సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ,
మాటలు: డార్లింగ్‌ స్వామి,
సహ నిర్మాత: వల్లభ,
నిర్మాత: కె.ఎస్‌.రామారావు,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.