రివ్యూవర్స్‌పై ఈయన కూడా..!

Tarun Bhaskar comments on film critics

‘పెళ్లి చూపులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంతా చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆ నమ్మకం వమ్ము అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో పాటు సినిమా సోదిగా ఉందంటూ విమర్శు తెచ్చి పెట్టుకుంది. ప్రస్తుతం సినిమా ఏ ఒక్క థియేటర్‌లో కూడా సరిగా ఆడటం లేదు. మాస్‌, క్లాస్‌, మల్టీప్లెక్స్‌ ఇలా ఏ ఒక్క ఏరియాలో కూడా సినిమా ఆడటం లేదు. ఓవర్సీస్‌పై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. కాని రివ్యూల కారణంగా ఓవర్సీస్‌లో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

సినిమా విడుదల రోజే రివ్యూలు బ్యాడ్‌గా రావడంతో చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. దాంతో రివ్యూవర్స్‌పై దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అర్హత లేని వారు అంతా రివ్యూలు రాస్తున్నారు. సినిమా మేకింగ్‌ తెలిసిన వారు మాత్రమే రివ్యూలు రాయాలనే రూల్‌ ఉండాలంటూ తరుణ్‌ భాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో కూడా పలువురు రివ్యూలపై కామెంట్స్‌ చేశారు. గతంలో పెళ్లి చూపులు చిత్రానికి ఇదే రివ్యూలు హెల్ప్‌ అయ్యాయి. రివ్యూల వల్లే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్‌ అయ్యిందనే విషయాన్ని మర్చి పోయాడు. రివ్యూలు బాగా లేకుంటే బ్యాడ్‌గా బాగుంటే పాజిటివ్‌గా రాస్తాయనే కనీస ఆలోచన కూడా లేకుండా తరుణ్‌ భాస్కర్‌ నోరు పారేసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరం అయ్యాడు ఈయన. ఓటమిని జీర్ణించుకోలేక అతిగా ప్రవర్తిస్తున్నాడు.