టాలీవుడ్ లో విషాదం….సీనియర్ నటుడు కన్నుమూత

Telugu senior actor vinod passed away
Telugu senior actor vinod passed away
టాలీవుడ్‌ సీనియర్‌ క్యారెక్టర్‌ నటుడు వినోద్‌ మృతి చెందారు. హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆయన అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు. వినోద్‌ గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమయిన ఆయన 1980లో వి.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కీర్తి కాంత కనకం ఆయన మొదటి చిత్రం. ఈ సినిమాలో వినోద్ హీరోగా సినీ రంగప్రవేశం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. తెలుగు చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపం సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వినోద్‌కు భార్య వీణావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.