పవన్ కి థమన్..రజినీకి అనిరుద్..!

Superstar Rajinikanth
Superstar Rajinikanth

సినిమాలో పలు క్రేజీ కాంబినేషన్స్ ఎప్పటికీ సాలిడ్ హైప్ ని ఇస్తూ ఉంటాయి.మరి అది హీరో దర్శకుడు కావచ్చు అలాగే సంగీత దర్శకుడు కావచ్చు లేదా ముగ్గురు కూడా కావచ్చు. అయితే మ్యూజిక్ పరంగా చూసినట్టు అయితే సంగీత దర్శకులు తమ అన్ని చిత్రాలకి సెన్సేషనల్ ఆల్బమ్స్ ఇవ్వాలని లేదు. కానీ కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్ లు మాత్రం ఓ రేంజ్ లో ట్రీట్ ని ఫ్యాన్స్ కి ఇస్తాయి.

అలాంటీ హీరో సంగీతం దర్శకుల కాంబినేషన్స్ లో అయితే ఇప్పటికి పలు చిత్రాలు వచ్చినా అదే క్రేజీ టెంపోలో ఫాన్స్ కి అడ్రినలీనే రష్ ఇస్తుంది .ఇప్పుడు మాత్రం కోలీవుడు సూపర్ స్టార్ రజినికాంత్ కి రాక్ స్టార్ అనిరుద్ కాగా మన తెలుగు నుంచి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి థమన్ అని చెప్పాలి జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తన హీరో రజినీకాంత్ కి మాస్ డ్యూటీ చేసాడు అంటునన్నారు.

అసలు సినిమా టైటిల్ కార్డు నుంచే అనిరుద్ మాస్ సంభవం చూపించగా లేటెస్ట్ గా అయితే “బ్రో” లాంటి సింపుల్ చిత్రానికి కూడా తన మ్యూజిక్ తో థమన్ కూడా సినిమా టైటిల్ కార్డ్ స్టార్టింగ్ నుంచే డ్యూటీ ఎక్కేసాడు. ఇలా ఈ ఇద్దరూ మాత్రం తమ హీరోస్ ఇప్పటివరకు ఎక్కడా కూడా తగ్గకుండా సెన్సేషనల్ మ్యూజిక్ ని కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ గాని అందిస్తున్నారు అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్స్ నుంచి ఎలాంటీ మ్యూజిక్ బ్లాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.