రుణాలు భవిష్యత్తుకు పెట్టుబడి: మంత్రి కేటీఆర్.

Election Updates: Blessing meeting in Karimnagar today.. Minister KTR as chief guest
Election Updates: Blessing meeting in Karimnagar today.. Minister KTR as chief guest

యూపీఎస్సీ పరీక్ష కంటే ప్రజాక్షేత్రంలో గెలవడం కఠినమైదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు మొహాలీ ఐఎస్‌బీ క్యాంపస్‌లో ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో మంచి రాజకీయ చర్చలు, దేశంలో విభజన రాజకీయాలు ఉన్నఉంటాయనుకోవడం వాస్తవ దూరమే అన్నారు. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తులో ప్రభుత్వాలకు మరింత సవాల్ అన్నారు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడం సవాలే అన్నారు. విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన వారు రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.తెలంగాణ ఉద్యమం వల్ల క్షేత్రస్థాయిలో తాను వారసత్వంగా వచ్చినప్పటికీ పని చేసే అవకాశం లభించిందన్నారు.

దేశంలోనే తెలంగాణ విజయవంతమైన రాష్ట్రం అన్నారు. తెలంగాణ మోడల్ ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు సవాల్‌తో కూడుకున్నవే అన్నారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పైసా పెట్టుబడి భవిష్యత్తుకు భరోసా అన్నారు. అభివృద్ధి కోసం రుణాలు తీసుకోకూడదనే పాత ధోరణి వల్ల భారత్ ప్రగతి పథంలో ముందుకు సాగడం లేదన్నారు. భారత్‌లో తప్ప ,అన్ని దేశాలు రుణాలను పెట్టుబడి ఆలోచన చేస్తుందన్నారు.