ఏపీ CMOలో ఐదుగురు అరెస్ట్..!

Five arrested in AP CMO..!
Five arrested in AP CMO..!

భారీ అవినీతి వ్యవహారం ఒకటి ఏపీ సీఎం కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఇది కుదిపేస్తోంది. కొంతమంది కార్యదర్శుల డిజిటల్ సంతకాల దుర్వినియోగం సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంలో ఐదుగురు చిన్న స్థాయి ఉద్యోగులను బాధ్యులను చేయడం మాత్రం విస్తు గొలుపుతోంది.పెద్ద అధికారులను వదిలి.. కిందిస్థాయి సిబ్బందిని నిందితులుగా చూపుతుండడం విశేషం.

ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవు ముత్యాలరాజు, ధనుంజయ రెడ్డి, సి ఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న కొందరు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేసినట్లు తేలింది. గత కొన్ని నెలలుగా సీఎంవో లో ఉన్న కార్యదర్శుల ఈ ఆఫీస్ లాగిన్ అయ్యి.. యూజర్ నేమ్ పాస్వర్డ్ లను వినియోగించి.. ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థులను సీఎంఓ కార్యదర్శులకు తెలియకుండా.. సీఎం పిటిషన్ తయారు చేసి సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. అదే సమయంలో సీఎం పిటిషన్లను ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ టు సీఎం సంతకాలను కాపీ,పేస్ట్ చేసి పంపించేవారట. ఇలా 66 సిఎంపీలు ఫేక్ అని గుర్తించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలోముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్ద తలకాయలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. గత కొద్దిరోజులుగా విచారణ జరిపిన సిఐడి ఐదుగురు సిబ్బంది పాత్రను గుర్తించి, 30 నుంచి 50 వేల రూపాయలు ఒక్కో ఫైల్ ప్రాసెస్ చేసేందుకు వసూలు చేసినట్లు తేలింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ముత్యాలరాజు పెషీ లో పనిచేస్తున్న మాజీ డీఈవో కనమర్ల శీను, జవహర్ రెడ్డి పేషీలో పనిచేస్తున్న డీఈవో నల్లజల సాయిరాం, ధనుంజయ రెడ్డి పేషీ లో పనిచేస్తున్న అటెండర్ గుత్తల సీతారామయ్య, ముత్యాలరాజు పేషీలో పనిచేస్తున్న చైతన్య, డీఈవో అబ్దుల్ రజాక్ ను అరెస్టు చేసినట్లు సిఐడి ఎస్ పి వెల్లడించారు.