‘లియో’ చిత్రం తో మంచి లాభం వచ్చింది …

‘లియో’ చిత్రం తో మంచి లాభం వచ్చింది ...
Cinema News

ఇలయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం లియో. ఈ భారీ యక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా ఎస్. నాగ వంశి విడుదల చేసారు.

‘లియో’ చిత్రం తో మంచి  లాభం వచ్చింది ...
Leo Producer ” Naga Vamsi “

అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి సక్సెస్ ని సాధించింది. కాగా నేడు ఒక మీడియా మీట్ లో భాగంగా ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ, లియో సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకుందని, యువతలు మూవీకి బాగా కనెక్ట్ అయ్యారని అన్నారు. అయితే సెకండ్ హాఫ్ పై కొద్దిగా కంప్లైంట్స్ ఉన్నాయని తెలియచేసారు . కాగా ఫైనల్ గా తమకు లియో ద్వారా మంచి ప్రాఫిట్స్ లభించాయని తెలిపారు నాగవంశీ.